పోలీసులు సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలి
నేర సమీక్షా సమావేశంలో సీపీ సత్యనారాయణ
రాంనగర్, ఫిబ్రవరి 24: విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలని సీపీ సత్యనారాయణ పోలీసులకు సూచించారు. కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో గురువారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, కేసుల దర్యాప్తులో వేగం పెంచి, పెండింగ్ కేసులను పరిషరించాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వారెంట్ల అమలు ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని పేరొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. భూ తగాదాల్లో తలదూర్చడం, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడిన ఘటనల్లో వచ్చే ఫిర్యాదులపై కేసు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, జే విజయసారథి, మదన్‌లాల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.