ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కురిక్యాలలో మెగా రక్తదాన శిబిరం
గంగాధర, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండలంలోని కురిక్యాలలో ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో బుధవారం చొప్పదండి నియోజకవర్గ స్థాయి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని గురువారం సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. ఎంపీపీ పర్లపెల్లి వేణు, ఏఎంసీ చైర్మన్లు సాగి మహిపాల్‌రావు, జనగాం శ్రీనివాస్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, లింగన్న, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్‌రావు, దూలం బాలగౌడ్, మెన్నేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం కొడిమ్యాల మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, పార్టీ అధ్యక్షులు మేచినేని నవీన్‌రావు, కత్తెరపాక కొండయ్య, పులి వెంకటేశ్, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, గంట్ల జితేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.