చిగురుమామిడి, అక్టోబర్ 25: టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్లీనరీకి మండలం నుంచి పార్టీ నాయకులు వెళ్లారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది వెళ్లారు. చిగురుమామిడి నుంచి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులు మంకు శ్రీనివాస్‌రెడ్డి, పెసరి రాజేశం, వేణు, విష్ణమాచారి వెళ్లారు.
టీఆర్ఎస్ ప్లీనరీకి జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు తరలివెళ్లారు. వారిలో మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్రావు, పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, మహిళా విభాగం అధ్యక్షురాలు కుసుంబ నవీన, నాయకులు న్యాత సుధాకర్, లింగాల మహేందర్‌రెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 25: టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో నాయకులు తరలివెళ్లారు. వారిలో కరీంనగర్ ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, పింగలి నరేందర్‌రెడ్డి, బేతి శ్రీనివాస్‌రెడ్డి, పెట్టం రమేశ్ తదితరులున్నారు.