బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 16, 2020 , 03:10:12

ఉపాధి కూలీలకు వేసవి భత్యం పెంపు

ఉపాధి కూలీలకు వేసవి భత్యం పెంపు

బాన్సువాడ రూరల్‌ : వేసవిలో భూ మి గట్టిగా ఉండడంతో కూలీలకు శ్రమ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఫిబ్రవరి ఒకటి నుంచి నుంచి వేసవి భత్యం పెంచుతూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న 3లక్షల 14వేల 522 మంది కూలీలకు  ప్రయోజనం చేకూరనుంది. వేసవి తీవ్రతను అంచనా వేస్తూ ఫిబ్రవరి నుంచి మే వరకు ఆయా నెలల్లో చేసిన పనులకు గతంలో కంటే పెంచిన వేతనం అదనంగా లభించనుంది. జిల్లాలో 22 మండలాలు ఉండగా, 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో678 అవాస ప్రాం తాలు ఉన్నాయి. వీటి  పరిధిలో 2లక్షల 11వేల 539జాబ్‌కార్డులు ఉండగా, 5 లక్షల 4816 కూలీలు జాబ్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్నారు. ఉపాధి పనులకు వస్తున్న శ్రమశక్తి సంఘాలు జిల్లాలో 14991 ఉండగా, అందులో 3.14లక్షల 522 మంది కూలీలు నమోదై ఉన్నారు. ప్రభుత్వం వేసవి భత్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ అదనంగా పెంచిన  వేసవి భత్యం  అందనుంది.


నెల వారీగా  వేసవి భత్యం  

ఉపాధి హమీ పథకంలో పని చేసే కూలీలకు వేసవి భత్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం వేసవి తీవ్రతను బట్టి ఆయా నెలల్లో  అదనపు కూలీ రేట్లను పెంచింది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు సాధారణ పనులకు ఇచ్చే వేతనకం కంటే కూలీలకు 20 నుంచి 30శాతం అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే మాసంలో 30శాతం, జూన్‌లో 20శాతం వేసవి భత్యం చెల్లించనుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడం, పని గంటలు తగ్గే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఉపాధి పనులకు పెరగనున్న కూలీల సంఖ్య  

ఉపాధి పథకంలో పనులకు వచ్చే కూలీలకు వేసవి భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధి కూలీలకు ప్రయోజనం చేకూరనుంది.  జిల్లాలో దాదాపు 15వేలకు పైచిలుకు శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3.14లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరందరికి మేలు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేసవి భత్యంతో జిల్లాలో ఉపాధి పనులు జోరందుకోనున్నాయి. ఈ ఏడు నిజాంసాగర్‌లో సరిపడా నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటలు అంతంత మాత్రంగానే ఉన్నా యి. దీంతో గ్రామాల్లో ప్రజలకు పనులు లేకుండా పోయా యి.  ప్రభుత్వం వేసవి భత్యం పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో  ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లోని కూలీల డిమాండ్‌కు సరిపడా ఉపాధి పనులను  ఉపాధిహమీ అధికారులు గుర్తించారు. 


ఫిబ్రవరి మాసం నుంచే వేసవి భత్యం 

ఉపాధిహమీ కూలీలకు వేసవి భత్యాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు పెంచి వేసవి భత్యం ఈ నెల ఒకటి నుంచి లభిస్తుంది. ఫిబ్రవరి మా సంలో చేసిన పనులకు అదనంగా 20 శాతం వేసవి భత్యం ప్రభుత్వ కూలీలకు చెల్లిస్తుంది. వేసవి కాలంలో భూమి గట్టి గా మారి కూలీలకు శ్రమ అధికంగా అవుతుంది. ఉపాధిహమీ పథకం చట్టం ప్రకారం కూలీలకు నిర్ణయించిన వేతనం అందించాలంటే వేసవిలో అదనపు భత్యం చెల్లించాలని కేంద్రం ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు  ఫిబ్రవరి మాసం నుంచి వేసవి భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


logo