సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 07, 2020 , 02:11:51

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 6: మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన వాటర్‌ ట్యాంకు పనులను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌ కాలనీలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. త్వరలో కాలనీలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ముంజంపెల్లి మురళీధర్‌, ముంజాల రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సెగ్గం సిద్ధు, దేవేందర్‌, రాయమల్లు, ఏఈ రామన్న పాల్గొన్నారు.


VIDEOS

logo