ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగాలి

- n ఏటూరునాగారం ఐటీడీఏ పీవో
- హన్మంత్ కొండిబా
- n గిరిజన సహకార సంస్థ కార్యాలయం తనిఖీ
- n రికార్డుల నిర్వహణ సరిగా లేదని అధికారులపై ఆగ్రహం
మహదేవపూర్, నవంబర్ 24: ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలని ఏటారునాగారం ఐటీడీఏ పీవో హన్మంతు కొండిబా అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని గిరిజన సహకార సంస్థ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. కార్యాలయంలో పలు రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండలకేంద్రంలోని గ్యాస్, రేషన్ గోదాంలను తనిఖీ చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సంబంధిత ఇన్చార్జిలను ఆదేశించారు. మండలంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. గ్యాస్, రేషన్ గోదాంల ఆవరణలో ప్రహరీ లేకపోవడంతో కార్యాలయాలకు భద్రత కరువైందని, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జీసీసీ మేనేజర్ హరిలాల్ కోరగా త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.