ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Sep 19, 2020 , 05:59:01

ఎలుగుబంటి సంచారం?

ఎలుగుబంటి సంచారం?

మహాముత్తారం, సెప్టెంబర్‌18: యామన్‌పల్లి గ్రామ సమీపంలోని సుద్దలోని చెరువు పక్కన ఉన్న అడవిలో గ్రామస్తులకు శుక్రవారం ఎలుగుబంటి పాదాల అచ్చులు కనిపించాయి. 19 రోజుల క్రితం నిమ్మగూడెం గ్రామంలో పెద్దపులి ఆవును చంపివేసింది. పలు గ్రామాల్లో పెద్దపులి అడుగులు కనిపించడం, వైల్డ్‌లైఫ్‌ అధికారులు పెద్దపులి అడుగులను గుర్తించిన సంగతి విదితమే. మళ్లీ ఇప్పుడు యామన్‌పల్లి గ్రామానికి కూతవేటు దూరంలోని అడవిలో ఎలుగుబంటి అడుగులు కనిపించడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పశువుల కాపరులు, రైతులు అడవిలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. ఎలుగుబంట్లు, గూడప్‌ బర్రెలు, జింకలు, దుప్పులు కొన్ని రోజులుగా గ్రామ శివారులోకి వచ్చి వెళ్తునాయని గ్రామస్తులు అంటున్నారు.logo