మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Aug 24, 2020 , 05:13:52

కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి

కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి

  • అన్నారంలో 15 గేట్లతో  నీటి విడుదల

కాళేశ్వరం : కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతూ వస్తోంది.  కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవాహించడంతో కాళేశ్వరం వద్ద నిండుకుండలా మారింది. అయి తే, శనివారం నుంచి మళ్లీ పెరుగూ ఆదివారం సాయంత్రం వరకు 10.01 మీటర్ల ఎత్తులో పారుతూ 433800  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వస్తోంది. ఇదిలా ఉంటే అన్నారం బరాజ్‌కు మానేరు నది, గోదావరి నది నుంచి 31000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా 12 గేట్లు తెరిచి 25000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బరాజ్‌లో ప్రస్తుతం 05.40 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

లక్ష్మీ బరాజ్‌లో 5.02 టీఎంసీలు 

మహదేవపూర్‌ : లక్ష్మీ బరాజ్‌లో 5.02 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్‌ అధికారులు తెలిపారు. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో బరాజ్‌కు 3,65,088 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 65 గేట్లు ఎత్తివేయడంతో నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వాజేడులో తగ్గుముఖం.. 

వాజేడు : మండలంలోని వాజేడు, పేరూరు , చింతూరు, ఎడ్జర్లపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న గోదావరి తగ్గుముఖం పడుతోంది. పేరూరు వద్ద గోదావరి 12 మీటర్ల మేర నీటమట్టం తగ్గి ప్రవహిస్తున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు .


logo