శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 08, 2020 , 02:51:21

వరంగల్‌లో మైండ్‌ ట్రీ సెంటర్‌!

వరంగల్‌లో మైండ్‌ ట్రీ సెంటర్‌!

వరంగల్‌, నమస్తే తెలంగాణ: వరంగల్‌ మహా నగర ప్రజలకు మరో శుభవార్త. హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో ప్రముఖ ఐటీ సంస్థ మైండ్‌ ట్రీ నూతన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నది.  ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రైలు ప్రారంభించిన సమయంలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఎల్‌ అండ్‌ టీ ఎండీ ఎన్‌ఎస్‌ సుబ్రహ్మణ్యన్‌ వరంగల్‌లో మైండ్‌ ట్రీ సెంటర్‌ ప్రారంభించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. వరంగల్‌ నగ రాన్ని ఐటీ హబ్‌గా మార్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సూచన మేరకు సుబ్రహ్మణ్యన్‌ సానుకూలంగా స్పందిస్తూ మైండ్‌ ట్రీ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చి నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. 

సమ్మక్క దీవెన

2014లో సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెల మీదకు వచ్చిన సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మళ్లీ 2020లో తల్లులు గద్దెలపై ఉన్న తరుణంలోనే వరంగల్‌ నగరంలో మైండ్‌ ట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎల్‌ ఎండ్‌ టీ సంస్థ ముందుకు రావడం విశేషం.


logo