e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జనగాం సీఆర్పీలు సమర్థవంతంగా పనిచేయాలి

సీఆర్పీలు సమర్థవంతంగా పనిచేయాలి

ఆన్‌లైన్‌ క్లాసులను పర్యవేక్షించాలి
రికార్డులు తయారు చేయాలి
జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ అధికారి సృజన్‌తేజ

చెన్నారావుపేట, జూలై 30: మండలంలోని సీఆర్పీలు సమర్థవంతంగా పని చేయాలని మండల నోడల్‌ అధికారి, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ అధికారి ఉండ్రాతి సృజన్‌తేజ సూచించారు. మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో శుక్రవారం ఆయన సీఆర్పీలు, ఎంఐఎస్‌, ఐఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. యూడైస్‌, ఎస్‌ఐఎస్‌ యాప్‌, హరితహారం, వ్యాక్సినేషన్‌, ఆన్‌లైన్‌ క్లాసుల సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, 1 నుంచి 6వ తరగతి వరకు నూతన విద్యార్థుల వివరాలు, జడ్పీహెచ్‌ఎస్‌లకు సంబంధించిన పాఠ్యపుస్తకాల వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలను పర్యవేక్షించాలన్నారు. వర్క్‌షీట్లు అందించి, మూల్యాంకనం చేసి రికార్డులు తయారు చేయాలని సృజన్‌తేజ సూచించారు. కార్యక్రమంలో ఎంఐఎస్‌ స్వప్న, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అశోక్‌, ఐఆర్పీలు శ్రీనివాస్‌, రాజేశ్‌, సీఆర్పీలు ముదురుకోళ్ల సంపత్‌, బాలు, హేమలత, శిల్ప, మెస్సెంజర్‌ నర్మెట్ట యాదగిరి పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
మండలకేంద్రంలోని నంబర్‌-1కాలనీ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో వీ రత్నమాల సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వినేలా తగిన చర్యలు తీసుకోవాలని, సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట హెచ్‌ఎం బుర్ర అజయ్‌కుమార్‌, సీఆర్పీ సంపత్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana