సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 21, 2021 , 02:05:50

అంగడి వేలం ఆదాయం రూ.16.40 లక్షలు

అంగడి వేలం ఆదాయం రూ.16.40 లక్షలు

లింగాలఘనపురం, జనవరి 20: జీడికల్‌ ఆలయంలో ని అంగడికి నిర్వహించిన వేలంలో రూ.16.40 లక్షల ఆదాయం సమకూరింది. ప్రతి శనివారం నిర్వహించే అంగడికి వేలం నిర్వహించగా 9 మంది పాల్గొన్నారు. లింగాలఘనపురానికి చెందిన కేమిడి వెంకటేశ్‌ 16.22 లక్షలకు వేలం దక్కించుకున్నారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31వ తేదీ వరకు వేలం కాలపరిమితి వర్తిస్తుందని ఈవో శేషుభారతి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ కొండకింది వేణుగోపాలచారి, వైస్‌ ఎంపీపీ కొండబోయిన కిరణ్‌కుమార్‌, విండో చైర్మన్‌  మల్గ శ్రీశైలం, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, సిబ్బంది కేకే రాములు, కుర్రెముల మోహన్‌, రాజేందర్‌రెడ్డి, భరత్‌కుమార్‌, మల్లేశం పాల్గొన్నారు. 


VIDEOS

logo