పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలి

- జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి
జఫర్‌గఢ్, జనవరి 4 : పల్లెప్రగతిలో చేపట్టిన పనుల్లో పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించాలని జడ్పీ సీఈవో రమాదేవి అన్నారు. మండలంలోని కూనూరులో సోమవారం నిర్వహించిన గ్రామసభకు సర్పం చ్ ఇల్లందుల కుమార్ అధ్యక్షత వహించగా రమాదేవి మాట్లాడారు. అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పల్లెల అందాలు పెంచిన ‘పల్లెప్రగతి’
దేవరుప్పుల : పల్లెప్రగతి పనులతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని మండల ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ డీపీఎం కొండల్‌రెడ్డి అన్నారు. మాధాపురంలో సోమవారం నిర్వహించిన గ్రామసభకు సర్పంచ్ స్రవంతి అధ్యక్షత వహించగా కొండల్‌రెడ్డి మాట్లాడారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలని సం బంధిత శాఖల ఏఈలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మానస, పంచాయతీ కార్యదర్శి యా కన్న, ఏపీఎం సురేందర్, టీఏ వెంకటేశ్, సీసీ సోమనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితోనే గ్రామాల అభివృద్ధి
బచ్చన్నపేట : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని మండల వ్యవసాయ అధికారి రఘురామకృష్ణ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో సర్పంచ్ తాతిరెడ్డి భవానీ శశిధర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమలో పీఆర్ ఏఈ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాధాకృష్ణ, ఉపసర్పంచ్ బూడిద శ్రీనివాస్, కారోబార్ గొల్లపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులపై దృష్టి సారించాలి
పాలకుర్తి రూరల్ : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఏపీడీ ఎండీ నూరొద్దీన్ అన్నారు. సోమవారం మండలంలోని మైలారంలో పెండింగ్ పనుల బిల్లుల విడుదల కోసం ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచ్ గుగులోత్ లక్పతి అధ్యక్షత వహించారు. నూరొద్దీన్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నామని, తక్షణమే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు నివేదికలను సమర్పించాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, కల్లాలు, మేకలకు, గేదెలకు షెడ్ల నిర్మాణానికి ఈజీఎస్ ద్వారా నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్, పీఆర్ ఏఈ పాషా, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంతి, ఎంపీవో దయాకర్, ఏపీవో అంబాల మంజుల, ఏపీఎం రమణాచారి, ఎంపీటీసీ పుస్కూరి కళింగరావు, ఉప సర్పంచ్ బాలు, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్, పాటిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం