సోమవారం 25 జనవరి 2021
Jangaon - Nov 26, 2020 , 02:07:04

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ సీరియస్‌

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ సీరియస్‌

  • జిల్లాలో 25 మంది సర్పంచ్‌లకు  షోకాజ్‌ నోటీసులు జారీ

జనగామ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 25 మంది సర్పంచ్‌లకు జిల్లా కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి రంగా చారి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రా మాల్లో శ్మశాన వాటికలు, రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనా లపై కొందరు సర్పంచ్‌లు నిర్లక్ష్యం వహిస్తుండడంతో షోకాజ్‌ నో టీసులు జారీ చేశామని చెప్పారు. తరిగొప్పుల మండలంలో ఒక రు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఒకరు, చిలుపూరులో ఇద్దరు, లింగాలఘన పురంలో ఇద్దరు, నర్మెటలో ఐదుగురు, రఘునాథపల్లిలో ఎనిమిది మంది, జఫర్‌గఢ్‌లో ఇద్దరు, బచ్చన్నపేట మండలంలో నలుగురు సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడు రోజు ల్లో సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకా రం చర్యలు తీసుకుంటామని రంగాచారి తెలిపారు. logo