గురువారం 28 జనవరి 2021
Jangaon - Oct 23, 2020 , 02:44:06

ఘనంగా ఏడొద్దుల సద్దుల బతుకమ్మ

ఘనంగా ఏడొద్దుల సద్దుల బతుకమ్మ

దేవరుప్పుల, అక్ట్టోబర్‌ 22: పెదమడూరులో గ్రామ ‘సంప్రదాయం ప్రకారం గురువారం ఏడొద్దులకే సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే మహిళలు తంగేడు, గునుగు, బంతి పూలతో ఇండ్లలో బతుకమ్మలు పేర్చి, గౌరమ్మ పూజలు చేశారు. సాయంత్రం మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామకూడళ్లలో బతుకమ్మ ఆటలు ఆడి ఊర చెరువులో నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా సర్పంచ్‌ ఆకవరం సుజనారెడ్డి వీధిలైట్లు, ఇతర ఏర్పాట్లు చేపట్టారు. మహిళలు సంబురంగా పండుగను జరుపుకున్నారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.


logo