మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Mar 08, 2020 , 02:42:11

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 07 : మహిళలంతా సంఘటిత శక్తిగా ఎదుగుతూ ఒకరికొకరు గౌరవించుకుంటూ.. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి అభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ కే నిఖిల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎంఆర్‌ గార్డెన్స్‌లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు జిల్లా సంక్షేమ అధికారిణి జ్యో తి పద్మ అధ్యక్షత వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, మహిళా కౌన్సిలర్లు, జిల్లా మహిళా అధికారులతో పాటు కలెక్టర్‌ కే నిఖిల హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ  ఆడవాళ్లు ఆకాశంలో సగం.. అవకాశంలో స గం అని.. సమాజంలో లింగ వివక్ష చూపకుండా మగ పిల్లలకు నైతిక విలువలు నే ర్పించాలని సూచించారు. ఆడ పిల్లలను మగపిల్లను సమానంగా చూస్తూ ఆడపిల్ల లు అభివృద్ధి సాధించిన తర్వాతనే వివాహా లు చేయాలని కలెక్టర్‌ తల్లిదండ్రులకు విజ్ఞ ప్తి చేశారు.


ప్రభుత్వ పథకాలు సైతం ఆడ పిల్లల అభివృద్ధికి అనుకూలంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మహిళలు ఎదగాలని కోరారు. కరోనా వైరస్‌ నివారణకు ప్ర తి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరోనా ప్రజల్లో చైత న్యం, అవగాహన కల్పించేలా విస్తృత ప్ర చారం జరగాలన్నారు. ఈ సందర్భంగా వి విధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలను ఆయా శాఖల ఆధ్వర్యంలో కలెక్టర్‌ నిఖిల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అంగన్‌వాడీ టీచర్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, అలాగే పోషణ అభియాన్‌ కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్‌ ఏ ర్పాటు చేశారు. 


కార్యక్రమంలో డీఆర్డీవో రాంరెడ్డి, డీపీఆర్వో  ప్రేమలత, జెడ్పీ సీఈవో రమాదేవి, ఉద్యానవనశాఖ జిల్లా అధికారిణి కేఆర్‌ లత, సెక్టోరియల్‌ అధికారిణి సంయుక్త రా ణి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారిణి ఉమారాణి, జెడ్పీటీసీ పద్మజ వెంకట్‌రెడ్డి, మహిళా కౌన్సిలర్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జూకంటి లక్ష్మి, వంగాల కల్యాణి, పా క రమ, చంద్రకళ, శ్రీజ, భూలక్ష్మి, బం డ పద్మ, సీడీపీవోలు రమాదేవి, ఫ్లోరెన్స్‌, జ యంతి, ఏసీడీపీవో పావని, అధికారులు, సిబ్బంది.విజయలక్ష్మి, రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo
>>>>>>