e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జగిత్యాల పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?

పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?

పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?

వాళ్లు సంతోషంగా ఉంటే ఈటలకు నచ్చదు
ప్రభుత్వ పథకాలను ఎప్పుడైనా మెచ్చుకున్నవా? ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
బరిగీసి బట్టలూడదీసే రోజు దగ్గర్లోని ఉంది

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు lటీఆర్‌ఎస్‌లో చేరిన బ్రాహ్మణపల్లి ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు
వీణవంక, జూన్‌ 21: ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏ రోజూ పేదల గురించి ఆలోచించలేదని.. మేలు చేసే ఏ ఒక్క పని చేయలేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు కనీస చిత్తశుద్ధి లేదని, ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి గానీ, దళితులు, బలహీన వర్గాలకు అందుతున్న పథకాలు ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదని మండిపడ్డారు. వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఉప సర్పంచ్‌ రెడ్డి శరత్‌రెడ్డి, ముగ్గురు వార్డు సభ్యులు, మరో 20 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, బ్రాహ్మణపల్లి గ్రామస్తులు కేసీఆర్‌ వెంటే ఉంటామని, గులాబీ జెండే ఎత్తుతామని టీఆర్‌ఎస్‌లోకి రావడం అభినందనీయమని కొనియాడారు. రాజకీయ పుట్టు పూర్వోత్తరాలు మరిచి, రైతుల కరెంట్‌ మోటార్ల సబ్సిడీ ఎత్తివేయాలని చూసిన బీజేపీలో ఎలా చేరావో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఎంతో శ్రమ కోర్చి రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంటే అవి అక్రమమని బీజేపీ మాట్లాడుతున్నదని.. గోదావరి, కృష్ణ, మానేరు వాగులపై మనకు ఉన్న హక్కులను హరించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మనపై కేసులు పెట్టిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 70 ఏళ్లుగా కోల్పోయిన నీళ్ల కోసం ప్రాజెక్ట్‌లు నిర్మించుకోవడం అక్రమమా అని నిలదీశారు. ఏ వర్గ క్షేమాన్ని కోరి బీజేపీలో చేరారో.. రాష్ర్టానికి ఇచ్చిందేదో.. ఇవ్వబోయేదేదో తెలియని పార్టీకి ఈటల దాసోహం అయ్యారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విమర్శించడం సరికాదని, ఇది ఈటలకు తగదని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్‌ రూ.లక్ష పంపించినా.. రైతు బీమాతో రూ.5లక్షలు ఇచ్చినా.. ఇదే కాదు టీఆర్‌ఎస్‌ చేసే ఏ మంచి పని కూడా ఈటలకు నచ్చట్లేదని, రైతుల కడుపుపై కొట్టే బీజేపీ మాత్రం నచ్చిందా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా మొత్తాన్ని కేంద్రం బహుళజాతి కంపెనీలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని, అలా జరిగితే మన పొలంలో మనమే వ్యవసాయ కూలీలు మారే పరిస్థితి రానుందని తెలిపారు.

ఈటల చేసిందేం లేదు : ఎమ్మెల్సీ నారదాసు
ఆరుసార్లు ఎమ్మెల్యే.. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో చేసిందేమీలేదని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మండిపడ్డారు. ఏండ్లు గడిచినా ఇంకా బస్సు సౌకర్యం లేని.. రోడ్డు సరిగ్గా లేని గ్రామాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, టీఆర్‌ఎస్‌ పార్టీతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పిన ఆయన, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. ఈటలకు టక్కర ఇచ్చేవాడు లేక ఎక్కువ మాట్లాడుతున్నాడని.. ముందుంది అసలు కథ అని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా భారీ మెజార్టీతో గెలిపించేలా కృషిచేయాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, మాజీ జడ్పీటీసీలు దాసారపు ప్రభాకర్‌, శ్రీదేవి, రెడ్డిపెల్లి సర్పంచ్‌ పోతుల నర్సయ్య, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, నాయకులు గాజుల రవీందర్‌, సమ్మయ్య, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -

ఏండ్లు గడిచినా మా ఊరికి బస్‌ వస్తలేదు..
ఈటల చాలా ఏండ్ల సంది ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించలే. ఊళ్లో సరిగ్గా రోడ్లు కూడా వేయలేదు. మండల కేంద్రానికి వెళ్లాలంటే నడుచుకుంటూ పోవాలె. ప్రైవేట్‌ ఆటోలో వెళ్లాలంటే చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి పోయిండు. కాంగ్రెస్‌తో కూడా ఏ పని అయితలేదు. సీఎం కేసీఆర్‌ సార్‌ చేసే పనులు నచ్చి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన. సీఎం కేసీఆర్‌ మీద ఉన్న నమ్మకంతో గులాబీ కండువా కప్పుకున్న. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఇప్పుడు మా గ్రామం అభివృద్ధి చెందుతుందని, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడుతాయనే నమ్మకం కలిగింది.

  • గాజుల వనిత, 7వ వార్డు మెంబర్‌,( బ్రాహ్మణపల్లి)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?
పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?
పేదలకు ఏనాడైనా మంచి చేసినవా..?

ట్రెండింగ్‌

Advertisement