పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
- 50 మంది టీఆర్ఎస్లో చేరిక
- కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల రూరల్, జనవరి 17: ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేశ్, తిప్పన్నపేట వార్డు సభ్యులు భారతపు వజ్రమ్మ, నీరటి లక్ష్మీరెడ్డి, తిప్పన్నపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బోగ నర్సయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రౌతు రెడ్డి, కుల సంఘాల పెద్దలు, మహిళలు 50 మంది టీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు, పార్టీకి మధ్య కార్యకర్తలు వారధులని పేర్కొన్నారు. తిప్పన్నపేట గ్రామంలోని ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారని, వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులదేనని ఉద్ఘాటించారు. అలాగే గ్రామంలో రూ.90లక్షల నిధులతో గచ్చుమాటు ఏర్పాటు తో నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించామని, ఇలా నియోజకవర్గ పరిధిలో చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమ లు చేస్తున్నామని స్పష్టం చేశారు. యువకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్‌రావు, జడ్పీటీసీ మహేశ్, పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్‌రావు, జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేశ్, నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రౌతు గంగాధర్, ఉప సర్పంచ్ బుచ్చన్న, ములాసపు మహేశ్, అంబారిపేట సర్పంచ్ గంగాధర్, శేఖర్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
పథకాలు.. ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
రాయికల్ రూరల్, జనవరి 17: రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఉప్పుమడుగులో ముదిరాజ్ సంఘ భవనం, మైతాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదివారం భూమిపూజ చేశారు. అలాగే ఇటిక్యాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించారు. మండలానికి చెందిన నాగిరెడ్డి రాజన్నకు రూ.20 వేలు, పాము విజయకు రూ.6వేల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మైతాపూర్లో బీ లింగారెడ్డి కొట్టం ప్రమాదవశాత్తు దగ్ధం కాగా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షే మం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, సర్పంచులు కైరి ముత్తయ్య, అజారొద్దీన్, సామల్ల లావణ్య-వేణు, ఎడ్మల జీవన్‌రెడ్డి, జక్కుల చంద్రశేఖర్, బెక్కం తిరుపతి, నాయకులు లోక బాపురెడ్డి, గన్నె రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, తలారి రాజేశ్, కొల్లూరి వేణు, నాయకులు పాల్గొన్నారు.