సోమవారం 25 జనవరి 2021
Jagityal - Nov 26, 2020 , 01:21:34

వివాహాలకు చేయూత

వివాహాలకు చేయూత

జగిత్యాల: భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఇద్దరు నిరుపేద యువతుల వివాహ ఖర్చుల కోసం చేయూతనందించారు. జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన వడ్లకొండ గంగవ్వ కుమార్తె మౌనిక, జిల్లా కేంద్రంలోని హన్మాన్‌వాడకు చెందిన కొండి రాజేశం-రాధ దంపతుల కూతురు నాగరాణి రూ.10వేల చొప్పున చెక్కులను పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు వొల్లాల గంగాధర్‌, చిలుక ప్రభాకర్‌ చేతుల మీదుగా అందజేశారు. గీతా సిల్క్‌ హౌస్‌ యజమాని కస్తూరి శశిధర్‌ ఇద్దరికి పెండ్లి పట్టుచీరెలు అందించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు సీహెచ్‌ శ్రీనివాస్‌, కొక్కుల సుదర్శన్‌, ఆకుబత్తిని శ్రీనివాస్‌, సంగీత శ్రీనివాస్‌, నందగిరి ప్రసాద్‌, జోగ మల్లేశం, చిలుక రాజన్న, మాచర్ల శంకర్‌, కోమాకుల సుదర్శన్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 

కథలాపూర్‌ మండలం తాండ్రియాలలో..

కథలాపూర్‌: మండలంలోని తాండ్రియాలకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అరిసెల్ల గంగాధర్‌ రెండో కూతురు దీపిక వివాహం బుధవారం జరుగగా  హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పుస్తె, మట్టెలు, పట్టుచీర అందజేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు హాజరై దుస్తులు అందించారు. వివాహానికి సంస్థ అధ్యక్షుడు కాసారపు శేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు చిం తకింది శేఖర్‌, సభ్యులు బండపల్లి మధు, కాసారపు శ్రీనివాస్‌, మాదిరెడ్డి మల్లారెడ్డి, కాసారపు గంగాధర్‌, సుదర్శన్‌, మహేశ్‌, జగన్‌, నాగరాజు, మహేశ్‌,  కిరణ్‌రావు హాజరయ్యారు.


logo