శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 27, 2020 , 02:23:30

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

 చొప్పదండి:  రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ ఎకరానికి రూ.5వేలు పెట్టుబడి సాయం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళపల్లిలో శుక్రవారం సర్పంచ్‌ వెల్మ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడినా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం అందజేయడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతాంగం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, వెల్మ జగన్‌రెడ్డి, ఏనుగు స్వామిరెడ్డి, వెల్మ సత్యనారాయణరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, గాండ్ల లక్ష్మణ్‌, వేణు, రైతులు పాల్గొన్నారు.


logo