గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 09, 2020 , 00:40:32

సమన్వయంతో ముందుకెళ్లాలి

సమన్వయంతో ముందుకెళ్లాలి

మల్యాల (కొడిమ్యాల) :  అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాభివృద్ధిలో ముందుండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. కొడిమ్యాల మండలంలోని మం డల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మెన్నేని స్వ ర్ణలత అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులనుద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ని ర్వహించి సర్వసభ్య సమావేశానికి అభివృద్ధిలో తేడా కనిపించినప్పుడే ప్రజల్లో మన విశ్వసనీయత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ  పనుల్లో ఎలాంటి వెనకబాటు పడకుండా కృషి చేస్తుందనీ, ఈ క్రమంలోనే ప్రతి విభాగపు అధికారి  అభివృద్ధిలో చొరవ తీసుకోవాలన్నారు. ప్ర భుత్వం మంజూరు చేసిన డీఎంఎఫ్‌టీ నిధులను సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభించి పూ ర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లోని అభివృద్ధి దశలు ఇ ప్పుడిప్పుడే మార్పులు కనబడుతున్నాయన్నారు. కొడిమ్యాల మండల అభివృద్ధికి గానూ తన నిధు ల నుంచి రాబోయే బడ్జెట్‌లో రూ.10లక్షలను కేటాయిస్తానన్నారు. అనంతరం పలు శాఖల సమీ క్ష నిర్వహించగా, సభ్యులు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

 టీఆర్‌ఎస్‌లో చేరిక..

  కొడిమ్యాల మండల కేం ద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బండ రవీందర్‌ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ర వీందర్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అనుమల్ల రఘు, ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, వైస్‌ ఎంపీపీ పర్ల ప్రసాద్‌, నాయకులు రాజనర్సింగా రావు, లింగం గౌడ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>