బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 09, 2020 , 00:38:05

ప్రగతి పథంలో పల్లెలు

ప్రగతి పథంలో పల్లెలు

మెట్‌పల్లి టౌన్‌: సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద మండలంలోని చింతలపేట గ్రామపంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామన్నారు. మున్ముందు ప్రజలకు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌ మ్యాకల అర్చన, ఉపసర్పంచ్‌ గోపి, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బాల్క సురేశ్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి మార్గం గంగాధర్‌, నాయకులు షేక్‌ నవాబ్‌, భీమనాతి సత్యనారాయణ, ఒజ్జెల శ్రీనివాస్‌, బత్తుల ప్రసాద్‌, సుదర్శన్‌, గోపి రాజరెడ్డి, ముత్యంరెడ్డి, గంగాధర్‌, రమేశ్‌, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆరోగ్యలక్ష్మి క్యాలెండర్‌ ఆవిష్కరణ 

కోరుట్లటౌన్‌: పట్టణంలోని కల్లూరు రోడ్డు ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభు త్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తల్లీబిడ్డ పోషణ’ ఆరోగ్యలక్ష్మి క్యాలెండర్‌ను శనివారం ఎమ్మెల్యే కల్వకుంట్ల ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీడీపీవో తిరుమలాదేవి, సూపర్‌వైజర్‌ ప్రేమలత, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి, కౌన్సిలర్లు గుండోజి శ్రీనివాస్‌, జిందం లక్ష్మీనారాయణ, గంధం గంగాధర్‌, నాయకులు ఆడెపు మధు, ఎండీ సనావొద్దీన్‌, జాల వినోద్‌కుమార్‌, వొలెపు రాజేశ్‌, విజయ్‌, ఆర్ఫాజ్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.   


logo
>>>>>>