e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home కరీంనగర్ పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
70 ఏండ్లలో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో జరిగింది
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దావ వసంత
మండల సర్వసభ్య సమావేశం

కొడిమ్యాల, జూలై 13: పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని, ఈ కార్యక్రమంతో పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా మారుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మేన్నేని స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఢిల్లీలాంటి నగరంలో ఆక్సిజన్‌ కొనుగోలు చేసే పరిస్థితి ఎదురైందని, సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో హరితహారం కార్యక్రమం చేపట్టారని అన్నారు. గతంలో గ్రామాలు శుభ్రంగా లేకపోవడంతో వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు వచ్చేవని, ఇప్పుడు కరోనా తప్ప మిగతా వ్యాధులను అరికడుతున్నామని ఉద్ఘాటించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలించే రాష్టాల్లో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, కేవలం తెలంగాణలో నే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.

ఈనెల 24న మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గం వాటర్‌ హబ్‌గా మా రిందని సంతోషం వ్యక్తం చేశారు. పొతారం నుంచి 7 గ్రామాలకు నీరందించే పనులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. టెండర్‌ పిలిచి పనులు చేయడానికి సంవత్సరన్నర పడుతుందని, ఆయా గ్రామాల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పూడూర్‌ గ్రామ రావికుంట చెరువును ఎల్లంపల్లి నీటితో నింపాలని కరోనాతో ఇటీవల మృతిచెందిన టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, పూడూర్‌ ఎంపీటీసీ అనుమండ్ల రాఘవరెడ్డి పలుమార్లు తన దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తు చేసు కున్నారు. రావికుంట చెరువును రాఘవరెడ్డి పేరు మీద మార్చాలని సభలో తీర్మానం చేయాలన్నా రు. ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి పేరు మార్పి డి చేయనునట్లు చెప్పారు. మండలానికి 9 చెక్‌ డ్యాంలు మంజూరయ్యాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ చొప్పదండి నియోజకవర్గానికి రూ.5 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను మండలానికి ఎక్కు వ సంఖ్యలో మంజూరు చేయడానికి మంత్రి ఈశ్వర్‌ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. అధికారులు అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. దళిత ఎంపవర్‌మెంట్‌ పథకం రూ.40వేల కోట్ల తో ప్రారంభించారని అన్నారు.

- Advertisement -

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దావ వసంత మాట్లాడుతూ, 70 ఏండ్లలో జరగని అభివృద్ధి రాష్ట్రంలో 7 సంవత్సరాల్లో జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పా రు. మిషన్‌ భగీరథ పథకంలో సమస్యలు ఉన్నాయని, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తే మం త్రి ఈశ్వర్‌ పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. అంతకుముందు మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన సమస్యలను సభ్యులు సభాదృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌ భూముల సర్వే నిర్వహించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, చెప్యాల ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి సభాదృష్టికి తీసుకువచ్చారు. ప్రతి గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్‌ పునుగోటి కృష్ణారావు కోరారు.

సూరంపేట గ్రామంలో తరుచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని, దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పరిష్కరించాలని ఎంపీటీసీ గుగులోత్‌ సుజాత సభాదృష్టికి తీసుకువచ్చారు. డబ్బుతిమ్మాయపల్లి పశుసంవర్ధఖ శాఖ సబ్‌ సెంటర్‌ పరిధిలో పశువుల వివరాలను ఏజెండాలో చేర్చకపొవడంపై ఎంపీటీసీ డబ్బు జగన్‌మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తిప్పాయపల్లి గ్రామ వైకుంఠధామానికి కరెంట్‌ సరఫరా చేయాలని సర్పంచ్‌ మ్యాకల లత సెస్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చా రు. అధికారులు స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనుమాండ్ల రాఘవరెడ్డి మృతిపై సభ్యులు సభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో మల్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్‌ స్వర్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

ఎంపీడీవోకు సన్మానం
మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా విధులు ని ర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన రమేశ్‌ను ఎమ్మెల్యే రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత శాలువాతో సన్మానించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు కూడా సన్మానించారు. కొండాపూర్‌ గ్రామ సర్పంచ్‌ సామంతుల ప్రభాకర్‌ బీసీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

ట్రెండింగ్‌

Advertisement