ఓక్లాండ్: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పేరు మారింది. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే మెటావర్స్ సాంకేతికత మీదుగా ఫేస్బుక్కు ‘మెటా’ అని పేరు మార్చినట్టు సంస్థ సీఈవో జుకర్బర్గ్ ప్రకటించారు. అయితే ఫెస్బుక్తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్స్ట్రాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఫేస్బుక్కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉంటుందన్నారు.
వర్చువల్/ఆగ్యుమెంటెడ్ రియాలిటీలో వినియోగదారులు సంభాషించుకొనేలా ఫేస్బుక్ త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని మెటావర్స్గా చెప్తున్నారు. అయితే, సమాచార దుర్వినియోగం, సమాచార భద్రతపై ఆందోళనలు.. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ విమర్శల నుంచి దృష్టి మరల్చేందుకే జుకర్బర్గ్ ఫేస్బుక్ పేరును మార్చారని ఆరోపణలు వస్తున్నాయి.