Zombie virus | కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసాన్ని మరవకముందే.. 50వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్ను గుర్తించి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో వేల ఏండ్లుగా మంచు కింద ఉన్న 24 వైరస్లను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించి వెలికి తీశారు. ఈ వైరస్లలో 13 కొత్త జాతులను గుర్తించామని, వాటికి జాంబీ వైరస్ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. ఇలాంటి ప్రాణాంతక వైరస్లు లక్షల ఏండ్లుగా మంచు కింద బందీ అయినవి అనేకం ఉన్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో కొందరు వ్యక్తులు రోడ్లపై చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో కొందరు తూలుతూ నడుస్తుంటే.. మరికొందరైతే వంగి తమను తాము కంట్రోల్ చేసుకుంటూ కనిపించారు. వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అమెరికాలో ఏం జరుగుతోంది..? బాంజీ వైరస్ ఏమైనా సోకిందా..?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘ఏంటీ జాంబీ వైరస్ అప్పుడే మానవాళిపై దాడిని మొదలు పెట్టిందా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. ‘బ్రో.. యూఎస్ఏలో అసలు ఏం జరుగుతోంది..?’ అంటూ మరో నెటిజన్ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశాడు. ‘మనం గత వారం విన్న జాంబీ వైరస్ కాదుగా ఇది..?’ అంటూ ఇంకో యూజర్ ప్రశ్నించాడు. అయితే, వీడియోల్లో తూలుతున్న వారంతా డ్రగ్స్ తీసుకున్న వారు అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా ఈ వీడియోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Brooo, what’s happening in the USA🙆🏽♂️💀? pic.twitter.com/hUJCjZ5Xlx
— Oyindamola🙄 (@dammiedammie35) December 6, 2022
Come see here bro
When I take drugs I go to the Moon (Yeah, Moon) pic.twitter.com/3WuBgVk4Go
— Big Michael ⚡ (@MickyLaz) December 6, 2022
This bro is gone 😭😂💀 pic.twitter.com/Uu4g8c00Ss
— Oyindamola🙄 (@dammiedammie35) December 6, 2022
This is Philadelphia, PA 🙁 pic.twitter.com/aA0o4uSu5j
— Felix Rends (@FelixRends) October 5, 2021
This is Los Angeles, California. pic.twitter.com/uQNu4okoxa
— James Woods (@RealJamesWoods) October 5, 2021