Hand Writing | జనవరి 28, లండన్ : మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఏదైనా కంటెంట్‌ను టైపింగ్ చేసే బదులు చేత్తో రాయండి. ‘కీ బోర్డ్ మీద టైపింగ్‌తో పోలిస్తే చేత్తో రాస్తున్నప్పుడు మెదడు అనుసంధానం మరింత విస్తృతంగా ఉంది. ఇలాంటి అనుసంధానం జ్ఞాపకశక్తికి, కొత్త సమాచారాన్ని విశ్లేషించడానికి కీలకం.
నేర్చుకొనేందుకు ప్రయోజనకరం’ అని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఆడ్రీ వన్ డెర్ మీర్ తెలిపారు. చేతిరాత, టైపింగ్‌లో ఉన్న నాడీ సంబంధమైన నెట్‌వర్క్‌ను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.