మాడ్రిడ్, ఆగస్టు 20: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా భావిస్తున్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్(117) కన్నుమూశారని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ‘మరియా మమల్ని వదిలి వెళ్లారు.
తాను కోరుకున్న రీతిలో ఎలాంటి నొప్పి లేకుండా నిద్రలోనే ప్రశాంతంగా మరణించారు’ అని ఆమె ఎక్స్ ఖాతాలో వారు రాశారు. వృద్ధుల అధ్యయన బృందం జపాన్‌కు చెందిన టొమికో ఇటుకా(116)ను ప్రస్తుతం అత్యంత వృద్ధ మహిళగా పేర్కొంది.
శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించిన మరియా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అట్లాంటిక్ సముద్రాన్ని దాటిన జ్ఞాపకం తనకు ఉందని చెప్పేవారు. 113 ఏండ్ల వయసులో కొవిడ్ బారిన పడ్డా ఆమె కోలుకోగలిగారు.