ఏదైనా కారు ఎంత పొడవు ఉంటుంది..? మహా అయితే 12 నుంచి 16 అడుగుల పొడవు ఉంటుంది. కానీ ఈ కారును చూశారా ఏకంగా 100 అడుగుల 1.5 అంగుళాల పొడవు ఉంది. ఈ కారులో ఎన్నో వసతులు ఉన్నాయి. స్విమ్మింగ్‌పూల్, చిన్నపాటి గోల్ఫ్ కోర్సు, బాత్టబ్తో పాటు ఏకంగా హెలీప్యాడ్ కూడా ఉంది. ఇందులో 75 మంది దాకా కూర్చోవచ్చు. ఇది గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. ఒరిజినల్‌గా దీన్ని 60 అడుగుల పొడవుతో 1986లో కాలిఫోర్నియాలో రూపొందించారు. ఆ తర్వాత దీని పొడవు పెంచుతూ ఉన్నారు.