వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎక్కువగా గురి కావడం వల్ల ఏఐ ప్రమాదకరమనే భావన ఎక్కువ మంది మహిళలకు ఉంది.
నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన బీట్రిస్ మేజిస్ట్రో, ఆమె బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అమెరికా, కెనడాలకు చెందిన సుమారు 3,000 మంది 2023 నవంబర్లో ఈ సర్వేలో పాల్గొన్నారు. జనరేటివ్ ఏఐ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నారా? అనే ప్రశ్నకు పురుషులు సగటున 4.38 స్కోరును ఇవ్వగా, మహిళలు సగటున 4.87 స్కోర్ ఇచ్చారు.