వాటికన్ సిటీ, ఏప్రిల్ 27: పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాథలిక్ మహిళల డిమాండ్‌కు అనుగుణంగా బిషప్‌ల సమావేశంలో ఓటు వేసేందుకు వారికి హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజా సమావేశంలో తీర్మానించారు.
క్యాథలిక్ చర్చి తీసుకునే నిర్ణయాల్లో ఇకపై మహిళలు భాగస్వాములు కానున్నారు. తమకు నిర్ణాయాధికారాలు కల్పించాలని వీరు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ ఇన్నేండ్లకు ఫలించింది.