న్యూఢిల్లీ : వినూత్న డ్రెస్‌లతో మగువలు ఇంటర్నెట్ను షేక్ చేస్తుండగా తాజాగా ఓ మహిళ ధరించిన వెరైటీ డ్రెస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఇజి వైట్ బాడీకాన్ డ్రెస్ ధరించిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. సస్టెయినబుల్ క్లోతింగ్ బ్రాండ్ పీహెచ్5 నుంచి ఈ డ్రెస్‌ను తయారుచేసినట్టు క్యాప్షన్ వెల్లడించింది.
ఈ బ్రాండ్ యూవీ-రియాక్టివ్ డ్రెస్‌ల తయారీలో గుర్తింపు పొందింది. ఈ వైట్ డ్రెస్ సూర్యరశ్మి తగలగానే పింక్‌లోకి మారుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 20 లక్షల లైక్స్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ డ్రెస్ ఏ ప్రదేశాల్లో ధరిస్తే బాగుంటుందని మరికొందరు పలు ఐడియాలను కామెంట్స్ సెక్షన్లో షేర్ చేశారు.