గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 12:49:35

3 నెల‌ల్లో 350 కోర్సులు చేసి రికార్డు సృష్టించిన మ‌హిళ‌!

3 నెల‌ల్లో 350 కోర్సులు చేసి రికార్డు సృష్టించిన మ‌హిళ‌!

క‌రోనా లాక్‌డౌన్ కొన్ని నెల‌ల పాటు అంద‌రినీ ఇంటికే ప‌రిమితం చేసింది. విద్యా, వ్యాపార స‌ముదాయాలు మూసేయ‌డంతో.. అంద‌రూ ఇంట్లోనే ఉండాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఎవ‌రికీ తోచిన ప‌ని వారు చేసుకుంటూ త‌మ దినచ‌ర్య‌ను కొన‌సాగించారు. కొంద‌రు వంటింటికి ప‌రిమితం అయ్యారు. మ‌రికొంద‌రు ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను పూర్తి చేశారు. చాలామ‌టుకు అమ్మాయిలు మాత్రం కొత్త‌కొత్త వంట‌కాల‌ను త‌యారు చేస్తూ గ‌డిపారు. కానీ ఈ మ‌హిళ మాత్రం లాక్‌డౌన్‌లో వంటింటికే ప‌రిమితం కాకుండా.. కాస్త ఆన్‌లైన్ కోర్సుల‌పై దృష్టి సారించింది. మూడు నెల‌లో 350 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసింది. అంతేకాదు యూనివ‌ర్స‌ల్ రికార్డ్ ఫోరంలో ప్ర‌పంచ రికార్డు సృష్టించింది.

కేర‌ళ‌కు చెందిన ఆర‌తి రేఘునాథ్ ఎంఇఎస్ కాలేజీలో ఎమ్మెస్సీ బ‌యోకెమిస్ట్రీ రెండ‌వ సంత్స‌రం చ‌దువుతున్న‌ది. 'క‌ళాశాల ప్రిన్సిపాల్ అజిమ్స్ పి ముహమ్మద్, కోర్సెరా కోఆర్డినేటర్ హనీఫా కె జి, క్లాస్ ట్యూటర్ నీలిమా టి కె సహకారంతో.. నేను ఈ కోర్సులను కొన్ని వారాల్లో పూర్తి చేయగలిగాను' అని ఆర‌తి చెప్పుకొచ్చింది. యూనివ‌ర్స‌ల్ రికార్డ్ ఫోరంలో ఆర‌తి ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు గ‌ర్వ‌ప‌డుతున్నారు.

 


logo