బీజింగ్, డిసెంబర్ 11: సాధారణం గా రైలు బోగీలను అనుసంధానించేందుకు కప్లింగ్ సిస్టమ్‌ని రైల్వే ఉపయోగిస్తుంది. అయితే ఈ పద్ధతికి స్వస్తి చెప్పి అనేక గూడ్సు రైళ్లను వైర్లెస్ సిస్టమ్ ద్వారా అనుసంధానించే రైలు సిస్టమ్‌కు చైనా పరీక్షలు నిర్వహించింది. మంగోలియాలోని బోషెన్ రైల్వేలో ఈ పరీక్షలు నిర్వహించారు. 35,000 టన్నుల (ఈఫిల్ టవర్‌కు మూడున్నర రెట్ల బరువు) సామర్థ్యం కలిగిన ఏడు గూడ్సు రైళ్లను వైర్లెస్ సిస్టమ్ ద్వారా అనుసంధానించి నడిపించినట్టు ప్రభుత్వ యాజమాన్యంలోని సీసీటీవీ తెలిపింది.
ఈ కొత్త టెక్నాలజీతో చైనా రైల్వే సరకు రవాణా సామర్థ్యం కొత్త రైల్వే లైన్లకు వేయవలసిన అవసరం లేకుండానే 50శాతానికి పైగా పెరుగుతుందని సీసీటీవీ తెలిపింది. తాజాగా మొత్తం ఏడు గూడ్సు రైళ్లు మెకానికల్ కప్లింగ్ లేకుండా వైర్లెస్ సిగ్నల్స్‌పై ఆధారపడిన కంట్రోల్ సిస్టమ్ ద్వారా కలసిపోయి నడిచినట్లు టీవీ పేర్కొంది.