వార్సా: యూరోప్‌లో అప్పుడే వేడి మొదలైంది. శీతాకాలంలోనే అక్కడ ఉష్ణోగ్రతలు ఊపందుకున్నాయి. పలు యూరోప్ దేశాల్లో జనవరి ఒకటో తేదీన కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. దాదాపు ఎనిమిది దేశాల్లో అత్యధిక స్థాయిలో జనవరి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శీతాకాలంలో వెదర్ వేడిగా మారడం..యురోపియన్లను కలవరపెడుతోంది. ఆ ఖండంలో 18 నుంచి 36 డిగ్రీల మధ్య అనేక ప్రాంతాల్లో టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి పశ్చిమ రష్యా వరకు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారాయి.
పోలాండ్లోని వార్సాలోని ఆదివారం 18.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగత్ర రికార్డు అయ్యింది. ఇక స్పెయిన్‌లోని బిల్బావోలు 25.1 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది. ఈ రెండు ప్రాంతాల్లో సగటు జనవరి ఉష్ణోగ్రతల కన్నా పది డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి. వాతావరణ మార్పుల వల్లే అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
లత్వియా, డెన్మార్క్, లుథియేనా, బెలారస్, నెదర్లాండ్స్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో జనవరి ఒకటో తేదీన అధిక టెంపరేచర్లు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్ దేశాల్లోనూ కొత్త రికార్డులు నమోదు అయినట్లు తెలుస్తోంది.