జెరూసలెం: భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో భారత ప్రధాని మోదీకి సలహా ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీకి ‘ప్రైవేట్”గా ఆ సలహా ఇస్తానని జోక్ చేశారు. ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో మీరు మోదీకి సలహా ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘మోదీ, ట్రంప్ నాకు గొప్ప స్నేహితులు.
అవును, నేను మోదీకి సలహా ఇస్తాను.. కానీ ప్రైవేట్‌గా’ అని నెతన్యాహు తెలిపారు. భారత్‌పై ట్రంప్ సుంకాల విధింపుపై స్పందిస్తూ ఇరు దేశాలు సామరస్యంగా ఆ విషయాన్ని పరిష్కరించుకోవాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ఇజ్రాయెల్ ఆయుధాలను ఉపయోగించారని.. అవన్నీ బాగా పని చేశాయని తెలిపారు.