వాషింగ్టన్: గోడకు ఒక వైపు నుంచి అవతలివైపుగల వ్యక్తుల కదలికలను గుర్తించగలిగే టెక్నాలజీని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది వైర్లెస్ సిగ్నల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటుంది. ఇది అందుబాటులోకి వస్తే, ఇండ్లలో భద్రత, వృద్ధుల సంరక్షణ, విపత్తు సమయాల్లో గాలించి, సహాయక చర్యలు చేపట్టడం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.
అయితే, ఈ టెక్నాలజీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైఫై రూటర్లను డీప్ లెర్నింగ్ అల్గ్గారిథమ్స్తో మాడిఫై చేసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీని కోసం సెన్సర్లు, కెమెరాల వంటి వాటిని ఉపయోగించలేదు. కేవలం వైఫై నెట్‌వర్క్‌ను మాత్రమే ఉపయోగించారు. వైఫై నెట్వర్క్ ఉన్న ఏ ఇల్లు అయినా, ఏ కార్యాలయం అయినా బేసిక్ మోషన్ సెన్సింగ్ సిస్టమ్‌గా మారిపోతుంది.