Asim Munir | ఇరాన్ నేతలను యుద్ధ దుస్తుల్లో, జేడీ వాన్స్‌ను సూట్లో కలిసిన అసిమ్ మునీర్.. ఎందుకంటే?
Asim Munir | యుద్ధంతో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ నేతలు ఆ దేశానికి చేరుకున్నారు. అయితే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కాకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరు దేశాల ప్రతినిధులకు స్వాగతం పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇస్లామాబాద్: యుద్ధంతో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ నేతలు ఆ దేశానికి చేరుకున్నారు. అయితే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కాకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim Munir) ఇరు దేశాల ప్రతినిధులకు స్వాగతం పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యుద్ధ దుస్తులైన కంబాట్ డ్రెస్‌లో ఆయన కనిపించారు.
కాగా, కొన్ని గంటల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి చేరుకున్నది. ఈ సందర్భంగా అసిమ్ మునీర్ సూటు, బూటు ధరించి వారికి స్వాగతం పలికారు. అయితే ఇరాన్, అమెరికా ప్రతినిధుల స్వాగతం సమయంలో అసిమ్ మునీర్ ఇలా విభిన్న డ్రెస్‌లో కనిపించడం, ప్రోటోకాల్‌ను పాక్ పాటించకపోవడం చర్చనీయాంశమైంది.
మరోవైపు జేడీ వాన్స్‌ను కలిసిన సందర్భంగా నల్ల సూటు ధరించిన అసిమ్ మునీర్, తనను తాను రాజనీతిజ్ఞుడిగా చూపించుకునేందుకు ప్రయత్నించినట్లు రాజకీయ నిఫుణులు భావిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం సందర్భంగా కూడా మునీర్ సూటు ధరించారు. తనకు ‘అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్’ అని ట్రంప్ ఆయనను ప్రశంసించారు.
అయితే 2024లో క్షిపణి దాడులు, సరిహద్దు ఘర్షణలతో ఇరాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ ఉద్దేశపూర్వకంగానే ఇరాన్ ప్రతినిధులకు కంబాట్ డ్రెస్‌లో స్వాగతం పలికినట్లు రాజకీయ నిఫుణులు భావిస్తున్నారు. అమెరికాతో దోస్తీ, ఇరాన్‌కు హెచ్చరిక సందేశాన్ని ఆయన ఇచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు.
అలాగే పాక్ అధికార కేంద్రంలో తానే కీలకమన్న సందేశాన్ని ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా అసిమ్ మునీర్ ఇలా తెలియజేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:
US-Iran Peace Talks: మినాబ్168… విమానంలో చిన్నారుల ఫోటోలతో ఇస్లామాబాద్‌కు ఇరాన్ బృందం
Iran | లెబనాన్‌పై దాడులు అపితేనే.. అమెరికాతో శాంతి చర్చలకు వస్తాం.. ఇరాన్ షరతు
Iran Israel War | యుద్ధం ఏం మిగిల్చింది.. 7 వేల మరణాలు.. 700 బిలియన్ డాలర్ల నష్టం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

