US-Iran Peace Talks: మినాబ్168… విమానంలో చిన్నారుల ఫోటోలతో ఇస్లామాబాద్‌కు ఇరాన్ బృందం
US-Iran Peace Talks: రక్తంతో తడిచిన స్కూల్ బ్యాగ్‌లు.. షూలు.. పువ్వులు.. మినాబ్ బాధితుల ఫోటోలతో.. అమెరికాతో జరిగే శాంతి చర్చలకు ఇస్లామాబాద్ బయలుదేరింది ఇరాన్ బృందం. మినాబ్ దాడిలో మృతిచెందిన చిన్నారులను స్మరిస్తూ ఇరాన్ బృందం నివాళి అర్పించింది. విమానంలో ముందు వరసులో ఆ చిన్నారుల ఫోటోలను పెట్టింది. ఆ పిక్‌ను స్పీకర్ ఘాలిబఫ్ పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా నేతల మధ్య ఇవాళ ఇస్లామాబాద్‌లో చర్చలు(US-Iran Peace Talks) జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ పయనమైంది. అయితే స్పీకర్ ఘాలిబఫ్ తన ఎక్స్ అకౌంట్లో ఓ ఫోటో పోస్టు చేశారు. ఈ విమానంలో నా తోటి ప్రయాణికులు వీళ్లే అని ఆ పోస్టుకు కామెంట్ ట్యాగ్ చేశారు. మినాబ్ 168 అని రాశారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఆకస్మికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజున మినాబ్‌లో ఉన్న ఓ పాఠశాలపై కూడా బాంబుల వర్షం కురిసింది. ఆ ఘటన వల్ల ఆ స్కూల్లో ఉన్న సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ హృదయవిదారకర ఘటనను స్మరిస్తూ ఘాలిబఫ్ చేసిన పోస్టు అందర్నీ కలచివేస్తున్నది.
ఇస్లామాబాద్ చర్చలకు వస్తున్న ఇరాన్ బృందానికి మినాబ్ 168ని ఆయన పేరు పెట్టారు. ఇక మినాబ్ ఘటనను గుర్తు చేసేలా.. విమానంలోని ముందు వరుసలో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఫోటోలు, స్కూల్ బ్యాగ్‌లు, పువ్వులు పెట్టారు. యుద్ధం మిగిల్చిన అవశేషాలు అన్న రీతిలో ఆ ఫోటోలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఘాలిబఫ్ పోస్టు చేసిన ఫోటోను దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా రీట్వీట్ చేసింది. మినాబ్ చిన్నారులను తాము ఎన్నటికీ మరవబోమన్నారు.
همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

