వాషింగ్టన్: తమ వేదికలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించడానికి మెటా కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ అయిన మెటా ఇప్పటి వరకు సమాచారాన్ని ధ్రువీకరించేందుకు థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్లపై ఆధారపడేది. అయితే, వీరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.
దీంతో తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని మెటా నిర్ణయించింది. దీని బదులు కొత్తగా ‘కమ్యూనిటీ నోట్స్’ అనే ఫీచర్ను తీసుకురానున్నది. ఈ ఫీచర్తో తప్పుదోవ పట్టించే పోస్టులకు యూజర్లు వారి అభిప్రాయాన్ని రాసే అవకాశం ఉండనుంది.