సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 21:07:13

‘బుబోనిక్‌ ప్లేగు’ కేసులను పర్యవేక్షిస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో

‘బుబోనిక్‌ ప్లేగు’ కేసులను పర్యవేక్షిస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా వైరస్‌ విషయంలో చైనాకు సానుకూలంగా వ్యవహరించిందని అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘బుబోనిక్‌ ప్లేగు’పై అప్రమత్తమైంది. మంగోలియా స్వతంత్ర ప్రాంతంలో ఉన్న బ‌య‌న్నూర్ ప‌ట్ట‌ణంలో బుబోనిక్ ప్లేగు కేసు న‌మోదు అయిన‌ట్లు బీజింగ్‌నుంచి ప్రకటన వెలువడగానే, దీనిపై పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో మంగళవారం పేర్కొంది. 

ఓ పశువుల కాపరికి వారాంతంలో బుబోనిక్ ప్లేగు ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. గత వారం పొరుగున ఉన్న మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో మార్మోట్ మాంసం తిన్న సోదరులకు కూడా ఈ వ్యాధి వచ్చినట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.  బుబోనిక్ ప్లేగు అనేది కొత్త కాదని, శతాబ్దాలుగా మనతోనే ఉంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హారిస్ పేర్కొన్నారు. ‘మేము చైనాలో నమోదవుతున్న బుబోనిక్‌ ప్లేగు కేసుల సంఖ్యను చూస్తున్నాం. ఇది ప్రబలకుండా ఆ దేశం సరైన చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం మేము దానిని అధిక రిస్క్‌గా పరిగణించడంలేదు. కానీ, మేం జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాం.’ అని హారిస్‌ తెలిపారు. చైనా, మంగోలియన్ అధికారుల భాగస్వామ్యంతో డబ్ల్యూహెచ్‌ఓ పనిచేస్తోందని స్పష్టం చేశారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo