న్యూయార్క్: టిక్‌టాక్‌లో డ్యాన్సు వీడియోలే కాదు.. ఇప్పుడు వార్ వార్తలు కూడా వైరల్ కానున్నాయి. వైట్‌హౌజ్ కొత్త డిటిజల్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో.. అమెరికా తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లో చేరవేసేందుకు కొత్త ప్లాన్‌ను ఆచరిస్తోంది. దేశంలో ప్రఖ్యాతి గాంచిన సోషల్ మీడియా స్టార్లతో వైట్‌హౌజ్ నిన్న భేటీ నిర్వహించింది. టిక్‌టాక్, యూట్యూబ్, ట్విట్టర్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న 30 మందితో వైట్‌హౌజ్ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఉక్రెయిన్ విషయంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను దేశీయ యువతకు చేర వేసే విధంగా సోషల్ మీడియా క్రియేటర్లు కాంటెంట్ తయారు చేయాలని వైట్‌హౌజ్ ఆ భేటీలో ఆదేశించింది. వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఈ మీటింగ్‌ను ఆర్గనైజ్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ యాప్ చాలా క్రేజీగా మారింది. ఆ దేశ యువత ఆ యాప్‌ను ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ స్టార్లను ఉక్రెయిన్ వార్‌పై కాంటెంట్ ఇచ్చే రీతిలో ప్రోత్సహిస్తున్నారు.
రష్యా అణ్వాయుధ వత్తిళ్లను ఎలా అమెరికా ఎదుర్కుంటుందో, ఉక్రెయిన్‌కు తమ నిధులు ఎలా అందుతున్నాయో సోషల్ మీడియా స్టార్లు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. బాంబు దాడుల వల్ల ధ్వంసమైన ఉక్రెయిన్ ప్రాంతాలు ప్రస్తుతం టిక్‌టాక్ వీడియోల ద్వారా పాపులర్ అవుతున్నాయి. ఇటీవల రష్యా కూడా సోషల్ మీడియా ద్వారా దుష్ ప్రచారం చేస్తోందని, దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఈ వ్యూహాం పనిచేస్తుందని అమెరికన్లను భావిస్తున్నారు.