Palestinian Islamic Jihad: ఏమిటీ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్.. గాజా ఆస్పత్రిపై దాడికి వాళ్లే కారణమా?
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడికి దిగింది పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు అని ఇజ్రాయిల్ వెల్లడించింది.
గాజా: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడికి దిగింది పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్(Palestinian Islamic Jihad) గ్రూపు అని ఇజ్రాయిల్ వెల్లడించింది. క్రూరమైన ఆ పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని ఇజ్రాయిల్ రక్షణ దళాలు ఆరోపిస్తున్నాయి. పీఐజే మిస్‌ఫైర్ చేయడం వల్లే ఆస్పత్రి ఘటన జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఇస్లామిక్ జిహాద్ అంటే ఏమిటీ, ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంతో ఆ సంస్థ పాత్ర ఏమిటో తెలుసుకుందాం.
ఇస్లామిక్ జిహాద్‌ను అధికారికంగా పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ అంటారు. ఇది సున్నీ ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూపు. పాలస్తీనా స్థావరాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయిలీలపై పోరాటం కోసం ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పాలస్తీనా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే ఆ గ్రూపు లక్ష్యం. 1970 దశకంలో పీఐజేను స్థాపించారు. పాలస్తీనాలో ఉన్న సాయుధ దళాల్లో ఈ గ్రూపును అత్యంత రాడికల్‌గా భావిస్తారు.
జియాద్ అల్ నక్లాహ్, ముహమ్మద్ అల్ హిందిలు ఇస్లామిక్ జిహాద్లో కీలక నేతలుగా ఉన్నారు. పాలస్తీనాలో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో హమాస్ తర్వాత ఇస్లామిక్ జిహాద్ రెండో స్థానంలో ఉంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్‌లో ఆ గ్రూపు సజీవంగా ఉంది. ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ వింగ్‌ను అల్ కుద్స్ బ్రిగేడ్స్ గా పిలుస్తారు. 1990 దశకం నుంచి ఆ గ్రూపు.. ఇస్లామిక్ టార్గెట్లపై వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఇస్లామిక్ జిహాద్, హమాస్ లక్ష్యం ఒక్కటే అయినా.. ఆ రెండు గ్రూపుల ఐడియాలజీ, వ్యూహం వేర్వేరుగా ఉంటుంది.
అయితే గత కొన్ని ఏళ్ల నుంచి హమాస్ రాజకీయంగా ఎదిగింది. 2006లో గాజాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు విజయం సాధించింది. కానీ ఇస్లామిక్ జిహాద్ మాత్రం ఇంకా సాయుధ దాడులకు అవకాశం ఇస్తోంది. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యకు రాజకీయ పరిష్కారంపై నమ్మకం లేదని ఇస్లామిక్ జిహాద్ భావిస్తున్నది. యూదుల సామ్రాజ్యంపై సాయుధ చర్యే కరెక్టు అని ఆ గ్రూపు విశ్వసిస్తోంది. పాలస్తీనా అథారిటీ, ఓస్లో ఒప్పందాలను ఇస్లామిక్ గ్రూపు తిరస్కరించింది.
ఉగ్రవాద నిరోధక నిపుణుల ప్రకారం.. ఇరాన్ ఉద్యమం నుంచి ఇస్లామిక్ జిహాద్ గ్రూపు ప్రేరణ తీసుకున్నది. ఇరాన్, సిరియా, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూపు నుంచి ఇస్లామిక్ జిహాద్ మద్దతు తీసుకుంటున్నది. 1997లో ఇస్లామిక్ జిహాద్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

