లాక్డౌన్ తీసిన ప్రాణాలు.. భవనంలో మంటలు చెలరేగి 10 మంది దుర్మరణం
Fire accident | చైనాలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు 10 మంది ప్రాణాలు తీశాయి. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో
బీజింగ్: చైనాలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు 10 మంది ప్రాణాలు తీశాయి. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో నిబంధనలను కఠినతరం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అయితే జనం ఇండ్ల నుంచి బయటికి రాకుండా గేట్లకు బయటి నుంచి తాళాలు వేస్తున్నారు.
చైనాలోని గ్జింజియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్‌ఖ్వీలో కూడా కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దాంతో లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా స్థానిక అధికారులు.. జనం బయటికి రాకుండా వివిధ నివాస సముదాయాల గేట్లకు తాళాలు వేశారు. ఈ క్రమంలో ఉరుమ్‌ఖ్వీ సిటీలోని తియాన్షాన్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో గత గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రమాదాన్ని గమనించి జనం ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా ఎక్కడికక్కడ తాళాలు వేయడంతో కుదరలేదు. దాంతో చూస్తుండగానే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాక్డౌన్ కారణంగా బిల్డింగ్ చుట్టూ కార్లు పార్క్‌చేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారింది. ఆలస్యం జరిగి ఉండకపోతే మరికొందరి ప్రాణాలైనా దక్కేవని స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Fire accident
- Urumqi
- Xinjiang
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

