ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని స్కై న్యూస్ ఇంటర్వ్యూలో కోరినపుడు భుట్టో స్పందిస్తూ, ‘రక్షణ మంత్రి చెప్పిన విషయంలో, పాకిస్థాన్‌కు గత చరిత్ర ఉన్నదనేది రహస్యమని నేను భావించడం లేదు. దాని ఫలితంగా మేం బాధపడ్డాం, పాకిస్థాన్ బాధపడింది. మేం నష్టపోయాం. ఒకదాని తర్వాత మరొకటి వచ్చిన తీవ్రవాద ప్రభంజనాలను ఎదుర్కొన్నాం. అయితే, జరిగిన నష్టం ఫలితంగా మేం గుణపాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మేం అంతర్గత సంస్కరణలు అమలు చేశాం’ అని చెప్పారు.