న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు చెందిన ఓ ఆడియో రిలీజైంది. గత ఏడాది ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశ విడిచి పరారైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఆన్లైన్లో ఆమె ఆడియోను రిలీజ్ చేసింది. తన ప్రాణాలు కాపాడిన అల్లాకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులు తనను చంపేందుకు కుట్ర పన్నినట్లు ఆమె చెప్పింది. సోదరి రెహానాతో కలిసి ఆగస్టు 5వ తేదీన హసీనా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.
కేవలం 20 నుంచి 25 నిమిషాల తేడాలోనే ప్రాణాలను దక్కించుకున్నానని, ఆగస్టు 21న జరిగిన సజీవంగా ప్రాణాలతో బయటపడిన ఫీలింగ్ కలుగుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. కోటలిపారాలో బాంబు దాడి, ఆగస్టు 5, 2024 అటాక్ నుంచి అల్లా తనను కాపాడినట్లు ఆమె చెప్పారు. బంగ్లా భాషలో ఆమె ఆడియో ఉన్నది. 2004, ఆగస్టు 21వ తేదీన హసీనాపై గ్రేనేడ్ అటాక్ జరిగింది. అప్పుడు ఆమె గాయాలతో బటయపడ్డారు. ఇంకా దేశానికి ఏదో చేయాలని అల్లా ఆశిస్తున్నారని, అందుకే తాను ప్రాణాలతో ఉన్నట్లు ఆమె తెలిపారు.
తాను తీవ్రమైన బాధలో ఉన్నట్లు ఆ ఆడియోలో తెలిపారు. తనకు దేశం లేదని, ఇళ్లు లేదని, అన్నింటినీ తగలబెట్టేశారని ఆమె పేర్కొన్నారు.