US and Nichals Maduro | నికోలస్ మదురోను చట్టబద్ద అధ్యక్షుడిగా పరిగణించం : అమెరికా స్పష్టీకరణ
US and Nicolas Maduro | వెనిజులా చట్టబద్ద అధ్యక్షుడి నికోలస్ మదురోను గుర్తించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేరుతో వైట్‌హౌస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
US and Nichals Maduro | వెనిజులాకు చెందిన నికోలస్ మదురోను చట్టబద్దమైన అధ్యక్షుడిగా గుర్తించడంలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్ హౌస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేరిట విడుదలైంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన 2015 నేషనల్ అసెంబ్లీని వెనిజులా చివరి ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అమెరికా పరిగణిస్తుందని తన ప్రకటనలో నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత జువాన్ గైడోను అమెరికా గుర్తించడం విశేషం.
2024 ఎన్నికలపై దృష్టిపెట్టిన అమెరికా.. మెక్సికోలో నికోలస్ మదురోతో చర్చలకు సిద్ధమని తెలిపింది. ఎన్నికల క్యాలెండర్‌ను జారీ చేయడం, ఎన్నికల రిజిస్ట్రీని ఆధునీకరించడం, అంతర్జాతీయ ఎన్నికల పరిశీలన మిషన్లను అనుమతించడం వంటి అంశాలను మెక్సికో వేదికపై చర్చించనున్నట్లు అమెరికా పేర్కొన్నది.
అంతర్జాతీయ కట్టుబాట్లకు అనుగుణంగా భవిష్యత్ ఎన్నికల ప్రక్రియలను మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నెడ్ ప్రైస్ తన ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, అన్యాయంగా నిర్బంధించిన వారిని విడుదల చేసేందుకు వెనిజులా, అంతర్జాతీయ సంస్థలతో అమెరికా కలిసి పనిచేస్తుందని నెడ్ ప్రైస్ వెల్లడించారు. ఇప్పటికైనా మానవ హక్కుల ఉల్లంఘనకు స్వస్తి పలకాలని ఆయన తన ప్రకటనలో హితవు పలికారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

