e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home Entertainment చరిత్రలో ఈరోజు : చిన్నారులు అభిమానించే వాల్ట్‌ డిస్నీ ప్రారంభం

చరిత్రలో ఈరోజు : చిన్నారులు అభిమానించే వాల్ట్‌ డిస్నీ ప్రారంభం

(చరిత్రలో ఈరోజు) వాల్ట్‌ డిస్నీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే, మిక్కీ మౌస్‌ అనగానే చిన్న పిల్లలు మొదలు పెద్ద వాళ్ల వరకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అదే మిక్కీ మౌస్‌ను తయారుచేసిన కంపెనీ వాల్ట్‌ డిస్నీ. 1923 లో సరిగ్గా ఇదే రోజున అమెరికాలోని లాస్‌ఏజెంలిస్‌లో వాల్ట్‌ డిస్నీ సోదరుడు రాయ్‌ డిస్నీతో కలిసి ప్రారంభించారు. ప్రజలను వినోదభరితం చేయడం, సమాచారం అందించడం, స్ఫూర్తి పొందేలా చేయడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ప్రారంభించిన ఈ వాల్ట్‌ డిస్నీ కంపెనీ అనతి కాలంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాత వినోద సంస్థగా నిలిచింది. ఈ సంస్థ నుంచి ఎన్నో ఐకానిక్‌ బ్రాండ్‌లు, సృజనాత్మక ఆలోచనలు, వినూత్న సాంకేతికతలను ప్రపంచానికి అందాయని చెప్పవచ్చు.

డిస్నీకి భారీ విజయం అందించిన పాత్ర మిక్కీ మౌస్ కథ కూడా వింతగా ఉన్నది. వాల్ట్ తన స్టూడియోలో కూర్చుని ఉన్నప్పుడు ఒక ఎలుక తన టేబుల్‌పైకి ఎక్కింది. అక్కడ ఎలుక ఎగిరిన విధానం చూసిన తర్వాత వాల్ట్‌కి మిక్కీ మౌస్ ఆలోచన వచ్చింది. ఇదే డిస్నీని వినోద పరిశ్రమకు రారాజుగా చేసింది. మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ ప్రతీ ఒక్కరి అందమైన చిన్ననాటి జ్ఞాపకాలలో ఉండి తీరుతాయంటే అతిశయోక్తి కాదు. కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రారంభ పేరు – డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియో. కంపెనీని ప్రారంభించినప్పుడు వాల్ట్ డిస్నీ సంస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. తిండికి కూడా డబ్బు లేదు. కార్టూన్లు అమ్మక అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

- Advertisement -

ఇలాఉండగా, 1928 మే నెలలో డిస్నీ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. డిస్నీ తన మొదటి షార్ట్ ఫిల్మ్ ‘ప్లేన్ క్రేజీ’ ప్రదర్శించింది. ఈ చిత్రం అట్లాంటిక్ మీదుగా చార్లెస్ లిండ్‌బర్గ్ మొదటి విమానం స్ఫూర్తిగా నిర్మించారు. ఈ చిత్రంలో మిక్కీ మౌస్ మొదటిసారి ప్రజల ముందు కనిపించింది. ఈ చిత్రం రెండు వారాల పాటు థియేటర్లలో ఉండి వేయి డాలర్లు సంపాదించింది. ఇక అక్కడి నుంచి డిస్నీ వెనక్కి తిరిగి చూడలేదు. 2020 లో వాల్ట్ డిస్నీ ప్రపంచ ఆదాయం 38.7 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఫోర్బ్స్ ప్రకారం దీని బ్రాండ్ విలువ 61.3 బిలియన్ డాలర్లు. డిస్నీ మీడియా బిజినెస్ నెట్‌వర్క్‌లో డిస్నీ ఛానల్, ఈఎస్‌పీఎన్‌, హిస్టరీ, లైఫ్‌టైం వంటి అనేక ఛానెల్‌లు ఉన్నాయి.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం

2012: సౌర వ్యవస్థ వెలుపల ‘ఆల్ఫా సెంచరీ బిబి’ అనే గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

2003: ఫ్రాన్స్ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డు పొందిన మలయాళీ చిత్రనిర్మాత అదూర్‌ గోపాలకృష్ణన్

1999: సైనిక పాలనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా

1984: దక్షిణాఫ్రికా సామాజిక కార్యకర్త డెస్మండ్ టుటుకు నోబెల్ బహుమతి ప్రదానం

1968: హరగోబింద్ ఖురానాకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం

1964: మొదటి అణు పేలుడును నిర్వహించిన చైనా

1939: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ భూభాగంపై మొదటి దాడి చేసిన జర్మనీ

1905: బెంగాల్‌ను విభజించిన బ్రిటీష్‌ ప్రభుత్వం

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇది ఫేస్‌బుక్‌ రహస్య బ్లాక్‌లిస్ట్‌.. బహిర్గతం చేసిన ఓ వెబ్‌సైట్‌

దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్‌‌..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement