మాస్కో: తమ నాయకుడు ప్రిగోజిన్ మరణమే కనుక నిజమైతే రష్యాపై మరో యుద్ధం తప్పదని అధ్యక్షుడు పుతిన్ను రష్యా ప్రైవేట్ సైన్యం వాగ్నర్ హెచ్చరించింది. ఇటీవల రష్యా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ బుధవారం రష్యాలో ఒక విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యా మీడియా ప్రకటించింది.
అయితే ఈ విమాన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రిగోజిన్ మరణం మిస్టరీగా మారింది. ఆయన మరణం వెనుక పుతిన్ ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రిగోజిన్ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. ప్రిగోజిన్ ప్రతిభావంతమైన వ్యాపారవేత్త అని అన్నారు. ప్రమాదంపై అధికార దర్యాప్తు ఫలితం కోసం వేచి చూడాల్సి ఉందన్నారు.