టోక్యో: జపాన్లోని టొకర దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.3గా నమోదైంది. దీనిపై జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. దీంతో జపనీస్ ‘బాబా వంగా’ రియో టట్సుకి చెప్పిన జోస్యం విఫలమైంది.
ఈ నెల 5న అత్యంత భారీ భూకంపం, సునామీ వస్తాయని ఆమె జోస్యం చెప్పారు. భూకంపం తీవ్రత సాధారణంగానే ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు క్యుషు, కిరిషిమ అగ్నిపర్వత సముదాయంలో ఉన్న షిన్మోడకే పర్వతం ఈ నెల 3న బద్దలైంది.