Volodymyr Zelensky | పుతిన్‌ని ఆయన సన్నిహితులే హతమారుస్తారు : జెలెన్స్కీ
Volodymyr Zelensky | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదొమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను ఆయన సన్నిహితులే హతమారుస్తారు అని అన్నారు.
Volodymyr Zelensky | రష్యా (Russia) – ఉక్రెయిన్ (Ukraine) మధ్య నెలకొన్న యుద్ధం (War) కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం నేటికీ చల్లారట్లేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా ‘ఇయర్’ (Year) పేరిట ఓ డాక్యుమెంటరీని (Documentary) రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదొమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూస్‌వీక్ (Newsweek) ఓ కథనం వెలువరించింది.
డాక్యుమెంటరీలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘పుతిన్ పాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కాక తప్పదు. అతని నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. పుతిన్‌ను ఆయన సన్నిహితులే వ్యతిరేకిస్తారు. వారు ఏదో ఒక కారణం చూపించి పుతిన్‌ను హతమారుస్తారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమిస్తా. కానీ, ఎప్పుడు..? అంటే మాత్రం నేను చెప్పలేను’ అని జెలెన్స్కీ అన్నారు.
పుతిన్‌పై అతని సన్నిహితులే అసహనంతో ఉన్నారని ఇటీవలే ది వాషింగ్టన్ పోస్ట్ (The Washington Post) తన కథనంలో అభిప్రాయపడింది. అంతేకాకుండా రష్యా ప్రజలు, పలువురు నేతలు, పుతిన్ సన్నిహితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు రష్యా నుంచి పలు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read..
Gujarat Earthquake | గుజరాత్‌ను వణికించిన రెండు స్వల్ప భూకంపాలు.. వారంలో ఐదోసారి..!
Samantha Ruth Prabhu | 13 ఏండ్ల ప్రయాణం.. ఇకపై నన్ను ఏదీ బాధించదు.. సమంత ఎమోషనల్ పోస్ట్..!
CRED CEO Kunal Shah | తన నెల జీతం ఎంతో చెప్పిన క్రెడ్ సీఈవో.. తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Iran | ఇరాన్లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం.. ఎందుకంటే..?
Twitter Lay Offs | ఉద్యోగులకు ఝలక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ట్విట్టర్..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

