Iran | ఇరాన్లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం.. ఎందుకంటే..?
Iran | ఇరాన్ (Iran), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) వంటి ఇస్లామిక్ దేశాల్లో (Islamic Countries) మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆయా దేశాల్లోని పాలకులు మహిళలు, బాలికల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇరాన్ (Iran)లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విషప్రయోగం (poisoning) చేశారు.
Iran | ఇరాన్ (Iran), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) వంటి ఇస్లామిక్ దేశాల్లో (Islamic Countries) మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆయా దేశాల్లోని పాలకులు మహిళలు, బాలికల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇరాన్ (Iran)లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విషప్రయోగం (poisoning) చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఇరాన్ మంత్రి యునెస్ పనాహీ (Younes Panahi) స్వయంగా వెల్లడించారు. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విష ప్రయోగం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు చెప్పారు.
‘ఖోమ్ (Qom) పాఠశాల్లో చాలా మంది బాలికలపై విషప్రయోగానికి పాల్పడుతున్నారు. బాలికల పాఠశాలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారు. కొందరు కుట్రపూరితంగానే ఇలా చేస్తున్నట్టు గుర్తించాం. విద్యా సంస్థలను ముఖ్యంగా మహిళలు చదివే పాఠశాలను మూసేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇలాంటి కేసులు వందలాదిగా నమోదయ్యాయి. బాధిత బాలికల్లో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. విషప్రయోగం కారణంగా బాలికలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రి చెప్పినట్టు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ (IRNA) పేర్కొంది.
అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారన్న విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోలేదని తెలుస్తోంది. కాగా, విషప్రయోగం కారణంగా అస్వస్థతకు గురైన బాలికల తల్లిదండ్రులు ఫిబ్రవరి 14న ఖోమ్ నగర గవర్నర్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై అధికారులు తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విషప్రయోగానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, నిఘా, విద్యా శాఖ మంత్రులు అదే ప్రయత్నంలో ఉన్నారని ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అలీ బహదోరీ జహ్రోమీ ఓ ప్రకటన చేశారు. కాగా, ఖోమ్ (Qom), దక్షిణ టెహ్రాన్ ( south of Tehran) లో వందల మంది విద్యార్థినులకు శ్వాసకోశం విషపూరితమైనట్లు వైద్యులు గుర్తించారు.
Also Read..
Twitter Lay Offs | ఉద్యోగులకు ఝలక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ట్విట్టర్..!
Ram Charan | రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం.. ఆర్ఆర్ఆర్ నటుడి స్పందన ఇదీ..!
Joseph Manu James | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- iran
- poisoning
- Qom
- south of Tehra
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

